TT

TT

నయనతో కెమిస్ట్రీ కుదిరింది

నయనతారతో కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందన్నారు సియాన్ విక్ర మ్. ఈయన కథా నాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఎంతకైనా సిద్ధపడే ఈ నట పిపాసి ఈ చిత్రంలో మరో రెండు వైవిధ్యభరిత పాత్రలకు జీవం పోశారనే చెప్పాలి. పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబుతమీన్స్ తన తమీన్స్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. విక్రమ్‌కు జంటగా తొలిసారిగా క్రేజీ నటి నయనతార జత కట్టిన ఈ చిత్రంలో మరో నాయకిగా నిత్యామీనన్ నటించారు. అరిమాతంబి చి త్రం ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం స్థానిక రాయపేటలో గల సత్యం సినిమా థియేటర్‌లో జరిగింది.నటుడు శివకార్తికేయన్, మలయాళ యువ నటుడు నివీన్‌బాలి విచ్చేసిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరి, నటి లిజి, గీతరచయిత మదన్‌కార్గీ పాల్గొన్నారు.

 
అభిమానులను అలరించాలనే..

విక్రమ్ మాట్లాడుతూ పత్రి చిత్రాన్ని అభిమానులను అలరించాలన్న ఆలోచనతోనే అంగీకరిస్తుంటానన్నారు. ఇరుముగన్ గురించి ఇప్పుడు తానేమీ చెప్పనని చిత్రం చూసిన తరువాత అదే మాట్లాడుతుందని అన్నారు. ఇరుముగన్ చిత్రం కోసం తాను తొమ్మిది నెలలు వేచి ఉన్నానని తెలిపారు.దర్శకుడు అంతగా వెయిట్ చేశారని, నిజానికి ఆయనకు ఒక పెద్ద హీరో చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, దాన్ని ఆయన అంగీకరించవచ్చునని అన్నారు. ద్విపాత్రాభినయం కథా చిత్రం కోసం తాను చాలా కాలంగా ఎదురు చూస్తున్నానన్నారు. ఇక చిత్ర నిర్మాత శిబు తమాన్స్ గురించి చెప్పేతీరాలన్నారు.ఆయన తాను నటించిన చాలా చిత్రాలను కేరళలో డిస్ట్రిబ్యూషన్ చేశారని తెలిపారు.
 
నయన్‌తో నటించడం గొప్ప అనుభవం

తాను, నటి నయనతార కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదన్నారు. నయనతార చాలా ప్రొఫెషనల్ అని పేర్కొన్నారు. ఆమెతో నటించడం గొప్ప అనుభవం అని.. తమ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని వ్యాఖ్యానించారు. ఇక నటి నిత్యామీనన్ కూడా అంతేనన్నారు. ఇక హరీష్‌జయరాజ్ అంటే తనకు చాలా ఇష్టమని,ఆయన తనకు చాలా మంచి పాటల్ని అందించారని విక్రమ్ పేర్కొన్నారు.
 
విక్రమ్ హిజ్రాగా నటించలేదు

విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఒక పాత్రలో రా అధికారిగా కనిపించనున్నారు. మరో పాత్ర హిజ్రా అనే ప్రచారం జరుగుతోం ది. అయితే దీనిపై దర్శకుడు ఆనంద్ శంకర్ స్ప ష్టం చేస్తూ హిజ్రాను కెమికెల్ ప్రాసెస్ ద్వారా ఆ డగాగానీ మగగా గానీ మార్చవచ్చునని  చిత్ర ంలో చెప్పామన్నారు. అయితే ఇందులో విక్రమ్ హిజ్రాగా నటించలేదన్నారు. కాగా రెండో పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఉం టుందన్నా రు. ఈ గెటప్ విక్రమ్ అభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచె త్తుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు హరి మాట్లాడుతూ విక్రమ్‌ది తనది హిట్ కాంబినేషన్ అన్నారు. తాము కలిసి పని చేసిన సామి చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయ్యిందని,ఆ చిత్రానికి సీక్వెల్‌కు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు.
Previous
Next Post »

pls comment ConversionConversion EmoticonEmoticon

భారత ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు.. ఆర్థిక సర్వే 2015-16ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 26న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వాతావరణం నిరాశాజనకంగా ఉన్నప్పటికీ భారత్ 2014-15లో 7.2 శాతం, 2015-16లో 7.6 శాతం వృద్ధి... Fast Speed scroll speed

Marquee Text